ఉపాధి హామీ పనుల్లో ముఖ హాజరు రద్దు చేయాలి

2చూసినవారు
ఉపాధి హామీ పనుల్లో ముఖ హాజరు రద్దు చేయాలి
హుకుంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో, ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న ఫేస్ అటెండెన్స్ విధానాన్ని రద్దు చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు కలిసి ఎంపీడీఓ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యల వల్ల కూలీలకు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయడం కష్టంగా మారిందని, పనుల కంటే ఫొటోలు తీయడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్