ఉపాధి హామీ కూలీలకు ‘ఫేషియల్ అటెండెన్స్’ ఇబ్బందులు

2చూసినవారు
ఉపాధి హామీ పనుల్లో కొత్తగా అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం కూలీలకు ఇబ్బందులు కలిగిస్తోంది. డుంబ్రిగూడ మండలం కొర్ర పంచాయతీలో మంగళవారం ఫేషియల్ అటెండెన్స్ నమోదు కాక అనేక మంది కూలీలు ఇబ్బందులు పడ్డారు. ఈ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతినే కొనసాగించాలని కూలీలు కోరుతున్నారు. ఎంపీటీసీ గుజ్జెల విజయ మాట్లాడుతూ, సాంకేతిక సమస్యల వల్ల ఈ కొత్త విధానంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్