రైతులకు ఎకరాలు 50, 000 నష్ట పరిహారం ఇవ్వాలి

1177చూసినవారు
రైతులకు ఎకరాలు 50, 000 నష్ట పరిహారం ఇవ్వాలి
అరకులో మొంథా తుఫాను కారణంగా వరి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజులైనా అధికారులు పంట నష్టం అంచనా వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనష్టం జరిగిన కుటుంబాలకు తక్షణ సాయం అందించి, ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.