ప్రధాన రహదారి పక్కనే చెత్తకుప్పలు

2చూసినవారు
ప్రధాన రహదారి పక్కనే చెత్తకుప్పలు
అరకులోయ మండల కేంద్రంలోని సినిమా హాల్ ఎదురుగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు, ఈగలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. పద్మాపురం పంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, పంచాయతీకి నిధులు ఉన్నప్పటికీ చెత్త తరలింపు, పారిశుధ్య పనులపై సరైన దృష్టి పెట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్