డుంబ్రిగూడ మండలంలోని పెదపాడు–శెట్టిబంద బీటీ రోడ్డు నిర్మాణ పనుల కోసం గొందివలస మీదుగా భారీ వాహనాల రాకపోకలతో గొందివలస వంతెన అప్రోచ్ రోడ్డు దెబ్బతింది. వర్షాల కారణంగా రోడ్డు బురదమయంగా మారి ద్విచక్ర వాహనాల రాకపోకలు సైతం కష్టంగా మారాయని స్థానికులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే పలుగ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత వారం రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు.