అరకు చలి ఉత్సవాల్లో జేసీ శ్రీపూజ డాన్స్‌తో సందడి

7చూసినవారు
అరకులో జరుగుతున్న చలి ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ శ్రీపూజ తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. "అదిరిపోద్ది సంక్రాంతి", "ఇదేమిటమ్మా మాయ మాయ" పాటలకు ఆమె చేసిన నాన్‌స్టాప్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను అభినందించారు. మరికొందరు అధికారులు, సిబ్బంది కూడా నృత్యాల్లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్