అనంతగిరి మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే వారపు సంత వేలంపాట అనివార్య కారణాల వల్ల ఈనెల 31వ తేదీకి వాయిదా పడింది. స్థానిక సెక్రటరీ సిఎస్. దేవ ఈ విషయాన్ని తెలిపారు. ఈ వేలంపాట స్థానిక సర్పంచ్ సోమెల. రూతు అధ్యక్షతన మండల పరిషత్ ఉప అధికారి నరసింహరావు నిర్వహిస్తారు.