వికసించిన మే పుష్పాలు

1చూసినవారు
ప్రకృతి ప్రియులను ప్రతి ఏడాది వేసవి కాలంలో అలరించే మే పుష్పం ఈసారి ముందుగానే వికసించింది. సాధారణంగా మే నెలలో పూసే ఈ పుష్పాలు, ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో విరబూశాయి. గుండ్రటి ఆకారంలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పువ్వులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మే నెల రాగానే వీటి కోసం ఆసక్తిగా ఎదురుచూసే ప్రకృతి ప్రేమికులు, ఈసారి ముందుగానే దర్శనమివ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్