కొర్రలో ‘ఒక నెల–ఒక గ్రామం’ కార్యక్రమం

2చూసినవారు
కొర్రలో ‘ఒక నెల–ఒక గ్రామం’ కార్యక్రమం
డుంబ్రిగూడ మండలం కొర్ర గ్రామంలో 'ఒక నెల–ఒక గ్రామం, ఆరు సందర్శనలు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ త్రివేణి తెలిపారు. గ్రామస్తులు, రైతులకు పరిపాలనను చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. రైతులు తమ భూమి, రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామసభలో అధికారులకు నేరుగా తెలియజేయాలని సూచించారు. స్వీకరించిన ప్రతి వినతిని పరిశీలించి, గరిష్ఠంగా నెల రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :