
ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడో దశ (SS3)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష ద్వారా ఎస్ఎస్ఎల్వీ పనితీరును విశ్లేషించి, డేటాను సేకరించినట్లు ఇస్రో తెలిపింది. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి వేగంగా ప్రయోగించడానికి, అధిక స్థాయిలో ఉత్పత్తికి ఇది అనుకూలంగా ఉంటుంది. SS-3 పేలోడ్‌కు సెకనుకు 4 కి.మీ వేగాన్ని అందించి, సామర్థ్యాన్ని 90 కిలోల వరకు మెరుగుపరుస్తుంది.




