డుంబ్రిగుడ మండలంలోని సాగర్ పంచాయతీ ముగిరిగూడ గ్రామంలో సోమవారం పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన నూతన గృహాలను ప్రారంభించారు. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి. సుబ్బారావు, ఎంపీడీవో ఎన్. విశ్వనాథ రిబ్బన్ కట్ చేసి గృహాలను ప్రారంభించారు. పేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.