రక్తకండిలో తాగునీరు, రోడ్డు సమస్యలపై నిరసన

1చూసినవారు
రక్తకండిలో తాగునీరు, రోడ్డు సమస్యలపై నిరసన
అరకులోయ మండలం రక్తకండి గ్రామంలో తాగునీరు, రహదారి సౌకర్యాలు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో 50 కుటుంబాలు నివసిస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తాగునీటి కొరతతో పాటు రహదారి సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్