అనంతగిరి మండల కేంద్రంలో పర్యాటకులు, స్థానికుల సౌకర్యార్థం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. అరకు–విశాఖ ప్రధాన రహదారిపై ఉండటంతో ఇక్కడ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండగా, మరుగుదొడ్ల లేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్వచ్ఛ
భారత్ మిషన్ కింద రూ. 3 లక్షలు, పంచాయతీ నిధుల నుంచి రూ. 50 వేలతో వీటిని నిర్మించినట్లు పంచాయతీ కార్యదర్శి దేవా తెలిపారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.