డుంబ్రిగూడ అంగన్వాడి కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించగా, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వ్యాధి నిర్మూలనకు సహకరించాలని ఆశ వర్కర్ మేరీ కోరారు.