పునాది దశలోనే నిలిచిన రహదారి నిర్మాణం

2చూసినవారు
పునాది దశలోనే నిలిచిన రహదారి నిర్మాణం
డుంబ్రిగూడ మండలం జాముగూడ–కోర్రాయి గ్రామాల మధ్య రహదారి, బ్రిడ్జి నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోవడంతో సుమారు 30 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి అన్నారు. గురువారం ఆయన నిరసన వ్యక్తం చేస్తూ, తక్షణమే రహదారి, బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ అసంపూర్తి నిర్మాణం వల్ల అత్యవసర వైద్య సేవలు, విద్యార్థుల రాకపోకలు, ప్రజల ప్రయాణాలకు తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్