రోడ్డు నిర్మాణం పూర్తి చెయ్యాలి..

8చూసినవారు
డుంబ్రిగుడ మండలం చమడపాడు రోడ్డు పాయింట్ నుంచి సాగరివలస వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు ఆందోళనకు దిగారు. 1.78 కోట్ల రూపాయలు మంజూరైన ఈ రోడ్డు పనులు కంకర వేసి మధ్యలో వదిలేశారని, దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు ఆపి వెళ్లిపోయారని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు.

ట్యాగ్స్ :