అరకులోయ మండలం మాదల పంచాయతీ బొందుగుడ గ్రామానికి రహదారి నిర్మించాలని గ్రామస్తులు మంగళవారం స్వచ్ఛందంగా శ్రమదానంతో నిర్మాణ పనులు చేపట్టారు. గ్రామానికి సరైన రహదారి లేక నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గతంలో పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.