
అన్వేష్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన గరికిపాటి (వీడియో)
ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు, యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ, 'నేరస్థుడికి శిక్ష కంటే సమాజం ఛీత్కరించుకున్నప్పుడే మార్పు వస్తుంది' అని పేర్కొన్నారు. ఏ మచ్చ లేని వారిపై బురద జల్లడం సరికాదని, తన అభిమానులు ఇలాంటి వాటిని సహించరని ఆయన తెలిపారు. ధర్మానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ, అసభ్యతపై సమాజం గళం ఎత్తాలని గరికిపాటి పిలుపునిచ్చారు.




