అరకు ఆసుపత్రిలో ఎస్టీ కమిషన్ ఆకస్మిక తనిఖీ

2చూసినవారు
అరకు ఆసుపత్రిలో ఎస్టీ కమిషన్ ఆకస్మిక తనిఖీ
అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ కొరతతో అత్యవసర సేవలు ఆలస్యమవుతున్నాయని, సిటీ స్కాన్ సౌకర్యం కల్పించాలని వైద్యులు ఆయనకు విన్నవించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవలు, పౌష్టికాహారం గురించి ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్