అరకులోయలో గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

2చూసినవారు
అరకులోయలో గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
అరకులోయ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజన మెనూను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు, పల్లీ చీక్కీలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :