డుంబ్రిగూడ మండల పరిధిలో స్వచ్ఛత కార్యక్రమాలను విస్తరించేందుకు శనివారం స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో విశ్వనాధ్ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వనాధ్ తెలిపారు.