టీడీపీ అధ్యక్షురాలు సన్యాసమ్మ బీటి రోడ్డు పనులు ప్రారంభం

1చూసినవారు
టీడీపీ అధ్యక్షురాలు సన్యాసమ్మ బీటి రోడ్డు పనులు ప్రారంభం
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు పంచాయతీలో రాములు పిఆర్ రోడ్డు నుండి వరకుగుమ్మి గ్రామం వరకు బీటి రోడ్డు పనులను టీడీపీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. దశాబ్దాలుగా రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కల నెరవేరిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాంగి శాస్త్రి బాబు, కిల్లో బలరాం, సోషల్ మీడియా కన్వీనర్ చెట్టి నవీన్ కుమార్, వెంగడ అక్షయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోడ్డు పనులు 2026 మార్చి 4న ప్రారంభమయ్యాయి.