అరకులోయలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తహసిల్దార్ స్పష్టీకరణ

1398చూసినవారు
అరకులోయలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తహసిల్దార్ స్పష్టీకరణ
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని మూడు పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరత లేదని తహసిల్దార్ కుమారస్వామి తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆయన బంకులను తనిఖీ చేశారు. ఐఓసీ బంకులో 8824 లీటర్ల పెట్రోల్, 15023 లీటర్ల డీజిల్, 2759 లీటర్ల పవర్ పెట్రోల్ నిల్వలున్నాయి. జీసీసీ బంకులో 7590 లీటర్ల పెట్రోల్, 11,918 లీటర్ల డీజిల్, 4454 లీటర్ల పవర్ పెట్రోల్, హెచ్‌పీసీఎల్ బంకులో 9000 లీటర్ల పెట్రోల్, 6000 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వాహనాల రద్దీ కూడా సాధారణంగానే ఉందని గుర్తించారు.

సంబంధిత పోస్ట్