విశాఖపట్నం నగరంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' అంటూ
వైసీపీ నాయకులు నిరసన ర్యాలీలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ జగదాంబ జంక్షన్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక వ్యక్తి చంద్రబాబు మాస్క్ ధరించి, రాష్ట్ర పటాన్ని గునపంతో పొడిచే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ నాయకులు దీనిని 'దోపిడీ రాజ్యం'గా అభివర్ణిస్తూ నినాదాలు చేశారు.