గిరిజన భూముల టెండర్ రద్దు చేయాలి

2చూసినవారు
గిరిజన భూముల టెండర్ రద్దు చేయాలి
అరకులోయ మండలం కొత్తవలసలో 2.5 ఎకరాల గిరిజన భూమిని ఎకో కాటేజీల పేరుతో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. పాడేరు ఐటీడీఏ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల భూములను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడం చట్టబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్