
పునరావాస కేంద్రంలో మహిళకు పాముకాటు (వీడియో)
AP: పునరావాస కేంద్రంలో ఓ మహిళకు పాము కాటువేసింది. సిబ్బంది అప్రమత్తమై ఆస్పత్రికి తరలించగా.. మహిళ ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ పునరావాస కేంద్రంలో చోటు చేసుకుంది. లక్ష్మీ అనే మహిళ అర్ధరాత్రి పిల్లలకు వాష్‌రూమ్‌కి తీసుకెళ్లగా.. అక్కడ పాము కరిచింది. హుటాహుటిన సిబ్బంది చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.




