ఒనుకొండకు రహదారి లేదు… గర్భిణుల కష్టాలు

5చూసినవారు
అనంతగిరి మండలంలోని లుంగాపర్తి పంచాయతీ పరిధి ఒనుకొండ గ్రామంలో దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం, గ్రామానికి చెందిన గర్భిణులు 10 కిలోమీటర్లు కాలినడకన లుంగాపర్తి ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. రహదారి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు వెంటనే స్పందించి రహదారిని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్