అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ పరిధిలోని డుంబ్రిగుడ మండలం సాగర పంచాయితీలోని అడపవలస గ్రామంలో మూడు వారాలుగా మంచినీటి ట్యాంకు పాడవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంచాయితీ అధికారులు స్పందించకపోవడంతో, గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి రూ.50 నుండి రూ.100 వరకు చందాలు వసూలు చేసి ట్యాంకును మరమ్మతు చేసుకున్నారు. ఈ విషయంపై గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ, గ్రామస్తుల చొరవతోనే సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.