అరకులోయ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య 'వెన్నుపోటు రెండేళ్లు' నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో, జూన్ 4 నుంచి 12 వరకు పంచాయతీ నుంచి జిల్లా కేంద్రాల వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని
వైసీపీ యోచిస్తోంది.