రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

6చూసినవారు
రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
అరకులోయలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డుంబ్రిగుడ మండలం గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు హుకుంపేట(M) గడుగుపల్లికి చెందిన మువ్వల శ్రీను(28), అరకులోయ (M) మాదల పంచాయతీ తోటవలసకు చెందిన కిల్లో జోసెఫ్(23)గా గుర్తించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో అతన్ని అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్