నందివలస అంగన్వాడీపై ఆకస్మిక తనిఖీ

3చూసినవారు
నందివలస అంగన్వాడీపై ఆకస్మిక తనిఖీ
మంగళవారం నాడు అరకులోయ మండలం నందివలస అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా అని పరిశీలించి, పిల్లలకు సరైన పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు. ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :