అరకులోయలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

1390చూసినవారు
ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలతో ఏజెన్సీ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ హిమగిరి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్