డుంబ్రిగూడ మండలంలోని సంతావలస–గుంటసీమ రహదారిపై ఉన్న చేతి పంపు బోరు పాడైపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రానికి వచ్చే గిరిజనులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బోరును మరమ్మతు చేయాలని వైసీపీ యూత్ అధ్యక్షుడు విజయదశమి సోమవారం కోరారు.