అనంతగిరి మండలం కొండిబ పంచాయతీలో 32 జట్లతో నిర్వహించిన
క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్థానిక ఎస్సై కే. శంకర్రావు విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతగిరి జట్టు ప్రథమ స్థానం (రూ. 15 వేలు), సాడ జట్టు ద్వితీయ స్థానం (రూ. 10 వేలు) సాధించాయి. ఈ సందర్భంగా ఎస్సై కే. శంకర్రావు యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.