మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం అరకులోయ చేరుకున్నారు. అరకు, పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ తనూజరాణి, ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. జగన్‌తో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ కూడా హెలీకాప్టర్‌లో ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగన్‌ను చూడటానికి తరలివచ్చారు.