
విశాఖ: బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్ల ఆందోళన
గత 13 నెలలుగా విశాఖ జీవీఎంసీలో పెండింగ్లో ఉన్న రూ. 450 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ నాగరాజు, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి సహా సభ్యులు పాల్గొన్నారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.





































