విశాఖపట్నం జిల్లా భీమిలిపట్నం నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుండగా, పాత కక్షలతో కొందరు వ్యక్తులు టీడీపీ కార్యకర్తలపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలపై భౌతిక దాడి చేశారని సమాచారం.