భీమిలి మండలంలోని సింగన్నబంధ గ్రామంలో నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో 5 మహిళా సంఘాలకు చెందిన 52 మంది సభ్యులు కలిసి 400 లీటర్ల జిల్లేడు ద్రావణాన్ని సామూహికంగా తయారు చేశారు. అడిషనల్ డి. పి. ఎం శ్యామల మాట్లాడుతూ, జిల్లేడు ద్రావణం పంటల్లో పొటాష్ లోపాలను సరిచేయడంతో పాటు, పురుగులు, తెగుళ్ల నివారణకు అద్భుతంగా పనిచేస్తుందని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా దీనిని వాడాలని రైతులకు సూచించారు.