భీమిలిలోని చెల్లపేట చెరువు దుస్థితిపై మాజీ ఐఏఎస్ అధికారి ఈ. ఏ. ఎస్. శర్మ, జల సంరక్షణ ఉద్యమకారుడు డాక్టర్ రాజేంద్ర సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా చెరువు పరిస్థితిని పరిశీలిస్తున్న తమకు ప్రస్తుత దుస్థితి మనస్థాపం కలిగించిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కాలుష్య నియంత్రణ మండలి డైరెక్టర్ పంచకర్ల సందీప్ ఈ సమస్యపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చెరువు పరిరక్షణకు పాలకులు తక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.