భీమిలి: స్థానిక అసోసియేషన్లకు జీవీఎంసీ పార్కుల నిర్వహణ

8చూసినవారు
భీమిలి: స్థానిక అసోసియేషన్లకు జీవీఎంసీ పార్కుల నిర్వహణ
విశాఖలోని జీవీఎంసీ పరిధిలోని పార్కుల నిర్వహణను స్థానిక అసోసియేషన్లకు అప్పగించనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్వతంత్ర నగర్ పార్కును పరిశీలించిన ఆయన, అక్కడ నివసిస్తున్న పేదలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5, 6, 7, 8 వార్డుల పార్కులను స్థానిక సంఘాల ద్వారా నిర్వహించి, అన్ని పార్కుల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్