సమస్త జీవరాశినీ కాపాడటమే నిజమైన మానవత్వమని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి అన్నారు. ఆదివారం మధురవాడలోని అయోధ్య నగర్‌లో ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశుపక్ష్యాదులకు నీటి వసతి కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో నీరు అందక ఏ జీవి అంతరించిపోకుండా ప్రజలు, ముఖ్యంగా
విద్యార్థులు అరణ్య మిత్రులుగా మారి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా జీవించడం ద్వారానే ప్రకృతిని కాపాడుకోగలమని ఆయన వివరించారు.