భీమిలి నియోజకవర్గంలో గురువారం రెండో రోజు మహానాడు వేడుకలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన పద్మనాభం, గెద్దపేట, భీమిలి, ఆనందపురం, జీవీఎంసీ 4వ వార్డుల్లో వర్చువల్ మహానాడు ప్రక్రియను పరిశీలించారు. ఆనందపురంలో కార్యకర్తలకు భోజనాలు వడ్డించి, సీనియర్ నాయకులను సత్కరించారు. పద్మనాభంలో మాజీ మంత్రి ఆర్. ఎస్. డి. పి. అప్పల నరసింహరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామంటూ నారా లోకేష్ చేసిన ప్రకటనపై ఎమ్మెల్యే గంటా హర్షం వ్యక్తం చేస్తూ, మహిళా నాయకురాళ్లతో కలిసి కేక్ కట్ చేశారు.