సింహాచలంలోని అడవివరం శ్రీనివాస్ నగర్‌తో పాటు 14 గ్రామాల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి, మరిడిమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏతపేటలోని శతకం పట్టు నుంచి అనుపు మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ వివరాలను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, ప్రెసిడెంట్ పి. వెంకట్రావు తెలిపారు.