భీమిలి: మధురవాడ డిపోను తనిఖీ చేసిన ఆర్ఎం

1చూసినవారు
భీమిలి: మధురవాడ డిపోను తనిఖీ చేసిన ఆర్ఎం
విశాఖపట్నం రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు మంగళవారం మధురవాడ ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీశక్తి, దివ్యాంగ శక్తి పథకాలతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, ప్రతి స్టాప్‌లో బస్సులు ఆపి, ప్రయాణికులను సురక్షితంగా చేరవేయాలని సూచించారు. బస్ స్టేషన్లలో పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఎండల తీవ్రత దృష్ట్యా సిబ్బంది ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్