భీమిలి మండలం చేపలుప్పాడలో దళితుడికి చెందిన భూమి కబ్జా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం, రావాడ సీతారాం మంగళవారం విచారణ నిర్వహించారు. బాధితుడు టి. అప్పలకొండ ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఇరు పక్షాల వాదనలు విన్నారు. భూమి సర్వే, పోలీసు చర్యల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు, దళితుల భూమి హక్కుల రక్షణకు కమిషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నివేదికను కమిషన్ చైర్మన్‌కు సమర్పించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.