భీమిలి: పీఎం పాలెంలోనూ స్పీడ్ గన్స్‌.. వేగం పెంచితే చలాన్‌

1చూసినవారు
విశాఖ నగరంలో మితిమీరిన వేగాన్ని అరికట్టేందుకు గ్రేటర్ పోలీసులు అధునాతన స్పీడ్ గన్స్‌ను రంగంలోకి దించారు. పీఎం పాలెం పరిధిలో వాహనదారులు నిర్దేశిత 50 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటితే, స్పీడ్ గన్స్ ద్వారా ఆటోమేటిక్‌గా రికార్డ్ అయి నేరుగా వారి ఇంటికే ఈ-చలాన్ చేరుకుంటుంది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు ఈ నిఘాను తీవ్రతరం చేశారు. బైక్ రైడర్లు, కారు చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, జరిమానాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని గ్రేటర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్