విశాఖపట్నం: విశాఖజాతీయ రహదారిపై పీఎం పాలెం దరి కారుషెడ్డు కూడలి వద్ద సోమవారం ఒక మినీ వ్యాన్ బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి విమానాశ్రయానికి చేపల లోడుతో వెళ్తున్న ఈ వ్యాన్, రెడ్ సిగ్నల్ పడటంతో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రద్దీ లేని సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని ట్రాఫిక్ సీఐ ఎన్. సాయి తెలిపారు.