భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతుల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. సోమవారం పద్మనాభం మండలం మద్ది గ్రామంలో జరిగిన ‘ఏరువాక’ కార్యక్రమంలో ఆయన నాగలి పట్టి పొలం దున్ని పనులను ప్రారంభించారు. జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’ కింద 18,573 మంది రైతులకు రూ. 9.28 కోట్లు, ‘పీఎం కిసాన్’ కింద 16,570 మందికి రూ. 3.314 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశామని, ఖరీఫ్‌కు 1,727 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.