ఏబులం గ్రామంలోని ఉపాధ్యాయురాలు రామలక్ష్మి ఇంట్లో బ్రహ్మకమలం పూలు విరబూసి అందరినీ ఆకట్టుకున్నాయి. ఫిజికల్ డైరెక్టర్ అయిన రామలక్ష్మి కొంతకాలంగా ఈ మొక్కలను పెంచుతున్నారు. ఇటీవల మొగ్గలు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. మంగళవారం సాయంత్రం నుంచి ఒక్కొక్కటిగా పూలు వికసించడం ప్రారంభించాయి. ఈ అరుదైన దృశ్యం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.