'ఢీ' జోడి బృందం వాహనంకు ప్రమాదం

2చూసినవారు
ఆనందపురం హైవేపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఢీ జోడి బృందానికి చెందిన పండు మాస్టర్‌తో సహ పలువురు గాయపడ్డారు. తగరపువలస గ్రామ దేవత పండగలో కార్యక్రమం ముగించుకుని గాజువాకకు వెళ్తుండగా, కారులో ఉన్న యువతికి వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో బొలెరో వాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనపై అనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్